నీట్ పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్
ABN , Publish Date - Jun 20 , 2026 | 05:34 AM
ఆదివారం జరిగే నీట్ పరీక్ష నిర్వహణలో సమన్వయానికి రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారిగా ఉన్నత విద్య కమిషనర్ భరత్ గుప్తాను నియమించింది.
అమరావతి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): ఆదివారం జరిగే నీట్ పరీక్ష నిర్వహణలో సమన్వయానికి రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారిగా ఉన్నత విద్య కమిషనర్ భరత్ గుప్తాను నియమించింది. ఉన్నత విద్య కమిషనరేట్‌లోనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సందేహాలకు 7893523455 నంబరుకు కాల్ చేయాలని ఉన్నత విద్య కమిషనరేట్ తెలిపింది.