Share News

ఐబీఎం క్వాంటమ్‌ నెట్‌వర్క్‌లో ఏక్యూసీసీ ఏర్పాటు

ABN , Publish Date - Jun 08 , 2026 | 05:02 AM

క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల సహకారం, క్వాంటమ్‌ వ్యవస్థ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం..

ఐబీఎం క్వాంటమ్‌ నెట్‌వర్క్‌లో ఏక్యూసీసీ ఏర్పాటు

అమరావతి, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల సహకారం, క్వాంటమ్‌ వ్యవస్థ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమరావతి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ (ఏక్యూసీసీ)ను ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసింది. ఐబీఎం చేసిన ఈ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం.. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ (ఏక్యూవీ) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ క్వాంటమ్‌ వ్యవస్థ ప్రధాన విభాగంగా ఉంటుందని, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, దానికి సంబంధించిన కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థాగత విభాగంగా ఏక్యూసీసీ పనిచేస్తుందని జీవోలో పేర్కొంది. ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పందాల ప్రకారం... ఏక్యూసీసీ పరిధిలో ఏర్పాటు చేసిన ఐబీఎం క్వాంటమ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌, ఐబీఎం క్వాంటమ్‌ అనుబంధ విద్యా, పరిశోధన, ఆవిష్కరణలు, ఇతర క్వాంటమ్‌ ప్రోగ్రాముల్లో పాల్గొనవచ్చు.

Updated Date - Jun 08 , 2026 | 05:03 AM