నోటిఫైబుల్ వ్యాధిగా కుష్ఠు వ్యాధి
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:49 AM
కుష్ఠు వ్యాధిని నోటిఫైబుల్ వ్యాధిగా ప్రభుత్వం గుర్తించింది. ఈమేరకు ఆరోగ్య శాఖ సెక్రటరీ సౌరబ్ గౌర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): కుష్ఠు వ్యాధిని నోటిఫైబుల్ వ్యాధిగా ప్రభుత్వం గుర్తించింది. ఈమేరకు ఆరోగ్య శాఖ సెక్రటరీ సౌరబ్ గౌర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం కుష్ఠు వ్యాధి నిర్మూలనకు తీవ్రంగా కృషి చేస్తోంది. అయినా అక్కడక్కడ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం కుష్ఠువ్యాధిని నోటిఫైబుల్ వ్యాధిగా గుర్తించింది. దీనివల్ల జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు ఈ వ్యాధిపై అత్యంత జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు నివారణ చర్యలు చేపట్టేందుకు వీలవుతుంది. శస్త్ర చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. మొత్తం కుష్ఠువ్యాధి రహిత రాష్ట్రాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ కమిషనర్‌ను ఆదేశించింది.’’