Share News

నేడు రాష్ట్ర పండుగగా అల్లూరి జయంతి

ABN , Publish Date - Jul 04 , 2026 | 04:38 AM

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు పర్యాటక శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌ శుక్రవారం..

నేడు రాష్ట్ర పండుగగా అల్లూరి జయంతి

అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు పర్యాటక శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలోని ఆయన స్వంత గ్రామమైన కృష్ణదేవీపేటలో జయంతి వేడుకల కోసం రూ.2 లక్షలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 4న అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించనుంది.

Updated Date - Jul 04 , 2026 | 04:39 AM