జనగణనపై ప్రజలకు విస్తృత అవగాహన: సీఎస్
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:49 AM
రాష్ట్రంలో జనాభా లెక్కల సేకరణ-2027పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు.
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జనాభా లెక్కల సేకరణ-2027పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనాభా లెక్కల సేకరణ సక్రమంగా, సజావుగా నిర్వహించాలని, దీనిపై రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ జారీ చేసిన మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎ్‌సఎంఈ పార్కుల ఏర్పాటుతోపాటు డిస్పెన్సరీలు, ఐఎంఎస్ ఆస్పత్రుల నిర్మాణానికి భూ కేటాయింపులు తదితర అంశాలపైనా సీఎస్ సమీక్షించారు.