గంజాయి, డ్రగ్స్‌ను ఉక్కుపాదంతో అణచివేయండి: సీఎస్
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:43 AM
సమాజానికి చేటు చేసే గంజాయి, డ్రగ్స్ వాడకాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జి.సాయి ప్రసాద్ ఆదేశించారు..
అమరావతి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): సమాజానికి చేటు చేసే గంజాయి, డ్రగ్స్ వాడకాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జి.సాయి ప్రసాద్ ఆదేశించారు. అమరావతి సచివాలయంలో బుధవారం నార్కోటిక్స్ కోఆర్డినేషన్ (నాకార్డ్) 2026 ఏడాదికి సంబంధించిన మొదటి త్రైమాసిక సమావేశం సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈగల్ చీఫ్ రవి కృష్ణను ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు మరింత సమన్వయంతో పని చేయాలని చెప్పారు. గంజాయి సాగు, రవాణా నియంత్రణపై ఒడిసా సీఎ్‌సకు డీవో లేఖ రాస్తానన్నారు. రవికృష్ణ ఈగల్ ఆపరేషన్ల ప్రగతిని వివరించారు. 54,416 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, 2153 కేసులు రిజిష్టర్ చేసి. 5548 మందిని అరెస్టు చేసి, 917 వాహనాలను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. త్వరలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈగల్ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నట్టు రవికృష్ణ తెలిపారు.