Share News

వేసిన పంటలు కాపాడాలి

ABN , Publish Date - Jul 27 , 2026 | 03:58 AM

జలాశయాల్లో నీటి కొరత కారణంగా.. ఇప్పటికే వేసిన పంటలను కాపాడాలని.. ఇందుకోసం కాలువల ద్వారా నీరందించడంతో సహా తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలని..

వేసిన పంటలు కాపాడాలి

ఇంటర్నెట్ డెస్క్: జలాశయాల్లో నీటి కొరత కారణంగా.. ఇప్పటికే వేసిన పంటలను కాపాడాలని.. ఇందుకోసం కాలువల ద్వారా నీరందించడంతో సహా తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఆదేశించారు. కృష్ణా, గోదావరి డెల్టాల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరందించడంపై ఆదివారం ఆయన సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, ఇతర ఇంజనీరింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నీటి చౌర్యం అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని స్పష్టం చేశారు. పిఠాపురంలో పంటలకు కాలువల ద్వారా నీరందించడంలో ఏర్పడిన అవరోధాలను పరిష్కరించాలన్నారు. ఇంజనీరింగ్‌ అధికారులంతా క్షేత్రస్థాయిలో మకాం వేయాలని ఆదేశించారు.

Updated Date - Jul 27 , 2026 | 04:00 AM