Share News

రాష్ట్రంలో క్రైమ్‌ రేట్‌ 14శాతం తగ్గింది: హోం మంత్రి

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:11 AM

కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో క్రైమ్‌ రేట్‌ 14 శాతం తగ్గిందని, ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా..

రాష్ట్రంలో క్రైమ్‌ రేట్‌ 14శాతం తగ్గింది: హోం మంత్రి

అనపర్తి, జులై 4 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో క్రైమ్‌ రేట్‌ 14 శాతం తగ్గిందని, ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా చేసేందుకు కృషి చేస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజధానిపై వైసీపీ నేతలు నిలకడ లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా ఆ పార్టీ బుద్ధి మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 05 , 2026 | 05:11 AM