Share News

కొవిడ్‌పై అలర్ట్‌

ABN , Publish Date - Jul 13 , 2026 | 03:09 AM

రాష్ట్రంలో కొవిడ్‌-19 కేసులు వెలుగు చూసినట్లు సమాచారం రావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో..

కొవిడ్‌పై అలర్ట్‌

  • బోధనాస్పత్రుల్లో మళ్లీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రారంభం

  • ఆర్‌టీపీసీఆర్‌ కిట్లు, నమూనాల సేకరణ సామగ్రి సరఫరా

  • శ్వాస సంబంధ వ్యాధులు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తే

  • తక్షణమే డైరెక్టరేట్‌కు సమాచారమివ్వాలని ఆదేశాలు

గుంటూరు మెడికల్‌, జూలై 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌-19 కేసులు వెలుగు చూసినట్లు సమాచారం రావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో తిరిగి కొవిడ్‌-19 స్ర్కీనింగ్‌ పరీక్షలను ప్రారంభించింది. ఆర్‌టీ పీసీఆర్‌ కిట్లు, శాంపిల్‌ కలెక్షన్‌ మెటీరియల్‌, వైరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీడియాను సరఫరా చేస్తోంది. వైద్య సిబ్బంది పీపీఈ కిట్లను వాడాలని సూచించింది. అనుమానిత రోగులకు చికిత్స కోసం ఆక్సిజన్‌ సరఫరా ఉన్న బెడ్లు, ఐసోలేషన్‌ వార్డులను సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు డీఎంహెచ్‌వోలు, డిస్ట్రిక్ట్‌ సర్వెలెన్స్‌ ఆఫీసర్లతో పాటు బోధనాస్పత్రుల సూపరిండెంటెంట్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు అందాయి.

Updated Date - Jul 13 , 2026 | 03:11 AM