Share News

సీఎంవో సెక్రటరీలకు శాఖలు మార్పు

ABN , Publish Date - Mar 24 , 2026 | 04:00 AM

ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో అధికారులకు శాఖల విభజన చేశారు. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన ముద్దాడ రవిచంద్ర స్థానంలో సీఎం ఎక్స్‌అఫీషియో స్పెషల్‌ సీఎస్‌గా విజయానంద్‌ నియమితులయ్యారు. కె

సీఎంవో సెక్రటరీలకు శాఖలు మార్పు

అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో అధికారులకు శాఖల విభజన చేశారు. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన ముద్దాడ రవిచంద్ర స్థానంలో సీఎం ఎక్స్‌అఫీషియో స్పెషల్‌ సీఎస్‌గా విజయానంద్‌ నియమితులయ్యారు. కె.విజయానంద్‌కు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), హోంశాఖ, ఆర్థిక శాఖ దాని అనుబంధ శాఖలు, రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్‌, ఎక్సైజ్‌, అటవీ, న్యాయ శాఖ, సీఎం కార్యాలయ వ్యవహారాలు, సీఎం ఢిల్లీ, విదేశీ పర్యటనల కో-ఆర్డినేషన్‌ బాధ్యతలు అప్పగించారు. సీఎం సెక్రటరీగా ఉన్న ఏవీ రాజమౌళికి జలవనరుల శాఖ, మైనింగ్‌, విద్యుత్‌, వ్యవసాయ, పశుసంవర్థక శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, మైనార్టీ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌, సీఎంఆర్‌ఎఫ్‌, సీఎం గ్రీవెన్స్‌ వ్యవహారాలు అప్పగించారు. మరొక సెక్రటరీ ప్రద్యుమ్నకు విద్యా శాఖ, ఆర్టీజీఎస్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవల్‌పమెంట్‌, దేవదాయ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖ, హౌసింగ్‌, మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఈడబ్ల్యూఎస్‌, క్రీడా, యువజన సంక్షేమ శాఖ, సీఎం జిల్లాల పర్యటన సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కార్తికేయ మిశ్రాకు గతంలో ఉన్న శాఖలను మార్చలేదు.

Updated Date - Mar 24 , 2026 | 04:01 AM