Share News

నేడు సిక్కోలుకు సీఎం

ABN , Publish Date - May 16 , 2026 | 05:28 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

నేడు సిక్కోలుకు సీఎం

  • నరసన్నపేటలో ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’

  • క్షేత్రస్థాయిలో ప్రజలతో ముఖాముఖి

శ్రీకాకుళం, మే 15(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి శనివారం ఉదయం 9 గంటలకు అమరావతిలోని ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 10.40 గంటలకు నరసన్నపేట మండలం తామరాపల్లి గ్రామానికి చేరుకుంటారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నరసన్నపేటలో ఏర్పాటు చేసిన ‘ప్రజావేదిక’ సభలో పాల్గొని, స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర లక్ష్యాలపై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు నరస్నపేటలోని ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్‌ను సందర్శిస్తారు.

Updated Date - May 16 , 2026 | 05:29 AM