Share News

జూన్‌లో సింగపూర్‌కు సీఎం

ABN , Publish Date - May 23 , 2026 | 06:23 AM

జూన్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌, అధికారుల బృందం సింగపూర్‌కు వెళ్లనుంది. జూన్‌ 14 నుంచి 16 వరకూ అక్కడ జరగనున్న వరల్డ్‌ సిటీస్‌ ఫోరమ్‌ సదస్సులో..

జూన్‌లో సింగపూర్‌కు సీఎం

అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): జూన్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌, అధికారుల బృందం సింగపూర్‌కు వెళ్లనుంది. జూన్‌ 14 నుంచి 16 వరకూ అక్కడ జరగనున్న వరల్డ్‌ సిటీస్‌ ఫోరమ్‌ సదస్సులో ముఖ్యమంత్రి బృందం పాల్గొంటోంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తోపాటు సీఎంఓ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్‌, ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌ వి.విజయరామరాజు, ఎకనామిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు (ఈడీబీ) సీఈవో షాన్‌మోహన్‌ హాజరవుతారు.

Updated Date - May 23 , 2026 | 06:23 AM