Share News

‘పునరుత్పాదకం’లో జోరు

ABN , Publish Date - May 20 , 2026 | 04:31 AM

పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడంలో భాగంగా పలు సంస్థల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది.

‘పునరుత్పాదకం’లో జోరు

  • 6700 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టులకు, 7 సీబీజీ ప్లాంట్లకు ఓకే

  • తిరుపతిలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు.. కడపలో అదానీ హైడ్రో ప్లాంట్‌

అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడంలో భాగంగా పలు సంస్థల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 98 టన్నుల (టీపీడీ) సామర్థ్యం కల ఏడు కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ (సీబీజీ) ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వీటితోపాటు సుమారు 6,700 మెగావాట్ల సామర్థ్యం కల మూడు సోలార్‌ ప్రాజెక్టులకు, తిరుపతిలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. బయోగ్యాస్‌ ప్లాంట్లను 24 నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశించారు. ప్రభుత్వం అనుమతి తెలిపిన ప్రాజెక్టులు ఇవీ

  • విజయనగరం జిల్లా వంగర మండలం తలగం గ్రామంలో అమృతశ్రీ బయో సీఎన్‌జీ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ 12 టీపీడీ కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆమోదం లభించింది.

  • ఎస్‌పీఎస్ఆర్‌ నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం సున్నంవారిచింతల గ్రామంలో శ్రీ బాలాజీ బయో ఎనర్జీస్‌ అండ్‌ ఆర్గానిక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 12 టీపీడీ సామర్థ్యంతో ఏర్పాటు చేసే ప్లాంటుకు ఆమోదం తెలిపారు.

  • తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో విభా బయోఫ్యూయల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 15 టీపీడీ సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.

  • ఎన్టీఆర్‌ జిల్లా జీ కొండూరు మండలంలో ఐఓసీ జీపీఎస్‌ రెన్యువబుల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ 15 టీపీడీ సామర్థ్యంతో కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తుంది.

  • తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామంలో ఎనర్జియా బయోఫ్యూయల్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ 12 టీపీడీ కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది.

  • ఏలూరు జిల్లా దెందులూరు మండలం ముప్పవరం గ్రామంలో 20 టీపీడీ కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆమోదం లభించగా దీన్ని హెచ్‌పీసీఎల్‌ రెన్యువబుల్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ సంస్థ ఏర్పాటు చేస్తోంది.


  • పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్లలో 12 టీపీడీ కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి డెల్టా బయోగ్యాస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు అనుమతి దక్కింది.

  • అనంతపురం జిల్లా డీహీరేహాల్‌ మండలంలోని కడలూరు, హులికల్‌ గ్రామాల్లో 140.80 మెగావాట్ల సామర్థ్యం కల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు క్లీన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ హైబ్రిడ్‌ థర్టీన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఆమోదం తెలిపారు.

  • శ్రీసత్యసాయి జిల్లా అమడగూరు మండలంలో 6,600 మెగావాట్ల సామర్థ్యం కల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు, దానితోపాటు 29వేల మెగావాట్ల సామర్థ్యం కల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజి సిస్టమ్‌ ప్రాజెక్టును రెండుదశల్లో ఏర్పాటు చేస్తారు.

  • క్లీన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ హైబ్రిడ్‌ త్రీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నంద్యాల జిల్లా అవుకు మండలం సింగనపల్లిలో 35 మెగావాట్ల సామర్థ్యం కల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

  • తిరుపతి జిల్లాలో యమన్‌కో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ 89 కిలో టన్స్‌ పర్‌ యానమ్‌(కేటీపీఏ) సామర్థ్యం కల గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టు 0.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్స్‌ పర్‌ యానమ్‌ (ఎంఎంటీపీఏ) గ్రీన్‌ అమ్మోనియాను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రాజెక్టును 36 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది.

  • వైఎస్సార్‌ కడప జిల్లాలో అదానీ హైడ్రో ఎనర్జీ ఎలవెన్‌ లిమిటెడ్‌ 2,250 మెగావాట్‌ సామర్థ్యంతో గండికోట-2 పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టులు అన్నింటికీ ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ -2024 ప్రకారం ప్రోత్సాహకాలు అందజేస్తారు.

Updated Date - May 20 , 2026 | 04:35 AM