Share News

తర్లువాడలో సెమీ కండక్టర్‌ పరిశ్రమకు ఓకే

ABN , Publish Date - May 19 , 2026 | 04:24 AM

విశాఖ జిల్లా తర్లువాడలో సెమీ కండక్టర్‌ తయారీ సంస్థ (అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ ఇన్‌ ప్యాకేజీ సంస్థ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

తర్లువాడలో సెమీ కండక్టర్‌ పరిశ్రమకు ఓకే

  • ఎకరం రూపాయికి.. 30 ఎకరాలు కేటాయింపు

అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లా తర్లువాడలో సెమీ కండక్టర్‌ తయారీ సంస్థ (అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ ఇన్‌ ప్యాకేజీ సంస్థ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.2,387.81 కోట్ల పెట్టుబడితో 1000 మందికి ఉద్యోగాలు కల్పించే సెమీకండక్టర్‌ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ), పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ), రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపాయి. ఈ సంస్థకు ఎకరా రూపాయి చొప్పున 30 ఎకరాలను తర్లువాడలో కేటాయించాలని ఏపీఐఐసీని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సేల్‌డీడ్‌ను కంపెనీ సూచనల మేరకు సిద్ధం చేయాలని ఏపీఐఐసీని ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

తర్లువాడలో సెమీ కండక్టర్‌ పరిశ్రమకు ఓకే

కేంద్ర ప్రభుత్వ రక్షణ సంస్థకు చెందిన నావల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ లేబొరేటరీ (ఎన్‌ఎ్‌సటీఎల్‌)కి అమరావతి క్వాంటం వ్యాలీలో 5000 చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో కేటాయిస్తూ ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - May 19 , 2026 | 04:25 AM