Share News

క్లీన్‌ ఎనర్జీ క్యాపిటల్‌గా ఏపీ!

ABN , Publish Date - May 21 , 2026 | 04:39 AM

క్లీన్‌ ఎనర్జీ క్యాపిటల్‌గా ఏపీ రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ-2024లో భాగంగా ఆమోదం...

క్లీన్‌ ఎనర్జీ క్యాపిటల్‌గా ఏపీ!

  • 11 నెలల్లోనే 600 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు పూర్తి: సీఎం

  • ప్రభుత్వ కార్యదక్షతను ప్రతిబింబిస్తోందంటూ హర్షం

అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): క్లీన్‌ ఎనర్జీ క్యాపిటల్‌గా ఏపీ రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ-2024లో భాగంగా ఆమోదం పొందిన మొట్టమొదటి ప్రాజెక్టు కేవలం 11 నెలల్లోనే ప్రారంభానికి సిద్ధం కావడంపై ‘ఎక్స్‌’లో సీఎం హర్షం వ్యక్తం చేశారు. ‘రాయలసీమ ప్రాంతం.. వైఎస్సార్‌ కడప జిల్లాలో ఎస్‌ఏఈఎల్‌ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 600 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయింది. సుమారు రూ3వేల కోట్ల పెట్టుబడితో రికార్డు స్థాయిలో 11 నెలల వ్యవధిలో దీని నిర్మాణం పూర్తి కావడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వ కార్యదక్షతను, పనుల అమలు తీరును ఇది స్పష్టంగా ప్రతిబింబిస్తోంది’ అని సీఎం పేర్కొన్నారు. ‘టైం మేటర్స్‌’ అంటూ ఈ ప్రాజెక్టుపై మంత్రి లోకేశ్‌ ‘ఎక్స్‌’లో చేసిన పోస్టును సీఎం ట్యాగ్‌ చేశారు.

Updated Date - May 21 , 2026 | 04:39 AM