హౌసింగ్ జీఎంగా రమేశ్ పోస్టింగ్ ఆర్డర్స్ రద్దు
ABN , Publish Date - Jun 30 , 2026 | 06:30 AM
రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ (జీఎం)గా కె.రమేశ్‌ను డిప్యుటేషన్‌పై నియమిస్తూ గతంలో ఇచ్చిన పోస్టింగ్ ఆర్డర్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ (జీఎం)గా కె.రమేశ్‌ను డిప్యుటేషన్‌పై నియమిస్తూ గతంలో ఇచ్చిన పోస్టింగ్ ఆర్డర్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పులివెందుల వ్యవసాయ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రమేశ్ కొంతకాలంగా ఏపీ స్టేట్ ఈబీసీ వెల్ఫేర్ కార్పొరేషన్‌లో జీఎంగా డిప్యుటేషన్‌పై సేవలందిస్తున్నారు. అక్కడి నుంచి తనను హౌసింగ్ కార్పొరేషన్‌లో జీఎం (అడ్మిన్)గా నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీనికి గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కూడా సమ్మతి తెలపడంతో రమేశ్‌ను డిప్యుటేషన్‌పై హౌసింగ్ కార్పొరేషన్ జీఎంగా నియమిస్తూ ఈ ఏడాది మే 5న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇతర శాఖల అధికారులతో గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, తగిన అధికారిని మాత్రమే నియమించాలని హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ క్రమంలో ఆ విషయాన్ని నిశితంగా పరిశీలించిన ప్రభుత్వం రమేశ్ పోస్టింగ్ ఆర్డర్స్‌ను రద్దు చేసింది.