Share News

30,355 కోట్లు... 34,610 ఉద్యోగాలు

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:59 AM

రాష్ట్రంలో రూ.30,355 కోట్ల పెట్టుబడులతో 34,610 మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నెల 18వ తేదీన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశం సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

30,355 కోట్లు... 34,610 ఉద్యోగాలు

  • ఎస్‌ఐపీబీ పెట్టుబడి సిఫారసులకు ఆమోదం

  • హోటల్‌ టూరిజానికి ఊతం..లక్ష గదులకు పెంపు

  • కుప్పంలో పారిశ్రామిక పార్కుకు 28.59 ఎకరాలు

  • బందరు సహా ఓడరేవుల పరిధి క్రమబద్ధీకరణ

  • తిరుపతిలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు రాయితీలు

  • క్యాబినెట్‌ నిర్ణయాలు.. మంత్రి కొలుసు వెల్లడి

అమరావతి, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రూ.30,355 కోట్ల పెట్టుబడులతో 34,610 మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నెల 18వ తేదీన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశం సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. హోటల్‌ టూరిజంలో భాగంగా కూటమి ప్రభుత్వం 4,390 హోటల్‌ గదులను గత రెండేళ్లలో తొమ్మిదివేలకు పెంచింది. వీటిని రానున్న కాలంలో లక్ష గదులకు పెంచాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం మీడియాకు వెల్లడించారు.

ముఖ్య తీర్మానాలు..

  • షెడ్యూల్‌ 9,10 కింద ఉన్న ప్రభుత్వ సంస్థలు, సొసైటీల రెగ్యులర్‌ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 60నుంచి 62 ఏళ్లకు పెంపు.

  • అమరావతిని క్వాంటం సాంకేతిక పరిజ్ఞానానికి అంతర్జాతీయ హబ్‌గా మార్చే ప్రాజెక్టులను వేగవంతంగా చేపట్టాలని నిర్ణయం. 11 ప్రముఖ సాంకేతిక సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం.

  • రాష్ట్ర విమానాశ్రయాల్లో ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాల కల్పనకు ఉద్దేశించిన నూతన విధాన మార్గదర్శకాల ముసాయిదాకు ఆమోదం.

  • ఏపీఎస్పీడీసీఎల్‌ విద్యుత్‌ కొనుగోలు చెల్లింపులకు ఆమోదం. ఇందుకోసం ఎస్‌బీఐ ద్వారా రూ.300కోట్ల అదనపు క్రెడిట్‌కు గ్యారెంటీ.

  • ఏపీ విద్యుత్‌ చట్టాల బిల్లు వెనక్కి.

  • అమరావతిలో ఫైవ్‌స్టార్‌ హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ అభివృద్ధికి వరుణ్‌ హాస్పటాలిటీ, ఇన్‌డ్రాయల్‌ హాస్పిటాలిటీ సర్వీసెస్‌ సంస్థలకు రాయితీలు.

  • విశాఖ జిల్లాలో త్రిఫల ఆయుర్వేదబ్రాండ్‌ కింద 35 పర్యావరణ అనుకూల కాటేజీలు, వెల్‌నెస్‌ సెంటర్‌, ఇకో వెల్‌నెస్‌ రిసార్ట్‌ అభివృద్ధికి విజయనగర్‌ ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థకు రాయితీ.

  • తిరుపతిలో 5స్టార్‌ హోటల్‌ ఏర్పాటుకు డైవిక్‌ హోటల్స్‌ సంస్థకు పర్యాటక రాయితీలు.


  • భీమునిపట్నం మండలం అన్నవరం వద్ద త్రీస్టార్‌ హోటల్స్‌ అభివృద్ధికి శుభ సంకల్ప్‌ సంస్థకు, కర్నూలు జిల్లా కల్లూరు వద్ద ఇంటిగ్రేటెడ్‌ టూరిజం పార్క్‌, 5స్టార్‌ హోటల్స్‌ కోసం వెస్సెల్లా హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌కు భూమి, పర్యాటక రాయితీలు.

  • విశాఖ మధురవాడలో 5స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి దుర్గా కాన్‌దేవ్‌, పద్మ హాస్పటాలిటీకి, ఎండాడ వద్ద త్రీస్టార్‌ హోటల్‌ ఏర్పాటుకు వైట్‌ ఓక్‌ రిసార్ట్స్‌కు భూమి, రాయితీలు.

  • ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద జలవనరుల శాఖకు చెందిన రెండెకరాల భూమి ఏపీఐఐసీకి బదిలీ.

  • పర్యాటక పాలసీలో సవరణలకు ఆమోదం.

  • డీమ్డ్‌ యూనివర్సిటీల్లో యూజీ కోర్సులు చదువుతున్న ఎస్టీ,ఎస్టీ విద్యార్థులకు పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పల పొడిగింపు.

  • మార్కాపురం, పోలవరం సహా 28 జిల్లా కలెక్టరేట్లలో 85 పోస్టుల క్రమబద్ధీకరణకు ఆమోదం.

  • ఏపీ ప్రైవేట్‌ యూనివర్సిటీ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్‌ జారీ.

  • ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, నెట్‌వర్క్‌ ఆస్పత్రుల మధ్య బిల్‌ డిస్కౌంటింగ్‌ సిస్టమ్‌ ఒప్పంద ధ్రువీకరణకు ఆమోదం.

  • పోతిరెడ్డిపాడు, బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ కాంప్లెక్స్‌ నుంచి కాలువవ్యవస్థ ఆధునీకరణకు కుదిరిన రూ.768కోట్ల ఒప్పందం అమలుకు ఓకే.

  • కుప్పం నియోజకవర్గం పోగురుపల్లిలో పారిశ్రామికపార్కు ఏర్పాటుకు 28.59ఎకరాల భూమి వర్గీకరణకు అనుమతి.

  • అమరావతిలో డిస్ర్టిక్ట్‌ కూలింగ్‌ సిస్టమ్‌ అభివృద్ధికి టాబ్రిడ్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందం రద్దు. ఏపీసీఆర్‌డీఏ ప్లాట్‌ కోడ్ల నామకరణ విధానంలో ప్లాటుల సరిహద్దుల తప్పులను సరిదిద్దటానికి ఆమోదం. రాజధానిలో మౌలిక వసతుల పనులకు చెందిన మూడు ప్యాకేజీల టెండర్లకు ఆమోదం.


  • అల్లూరి, పోలవరం జిల్లాలు మినహా అన్ని జిల్లాల రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో పీపీపీ విధానంలో ఒక్కో రిజిస్ర్టేషన్‌ సేవా కేంద్రం స్థాపన.

  • తిరుపతి జిల్లాలో రూ.2,509కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్‌ మోటార్‌ సైకిల్‌ తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థకు రాయితీలు..

  • నెల్లూరు జిల్లా దుత్తలూరులో క్షిపణుల ఉత్పత్తి కేంద్రం కోసం అనంత్‌ టెక్నాలజీస్‌కు 300 ఎకరాలు, అనంతపురం జిల్లా తిమ్మసముద్రంలో స్వేస్‌ ఫీల్డ్స్‌కు 120.76ఎకరాలు, కృష్ణా జిల్లాలో రక్షణ పేలుడు పదార్థాల తయారీకి ఐకామ్‌ టెలి లిమిటెడ్‌కు 300 ఎకరాల కేటాయింపు.

  • ఇండియన్‌ పోర్ట్స్‌ యాక్డ్‌ నిబంధనల ప్రకారం నౌకాశ్రయాల పరిధిని క్రమబద్ధీకరించడానికి ఆమోదం. మచిలీపట్నం పోర్టు పరిధి 64 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లకు, రామాయపట్నం పోర్టు పరిధి 51 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లకు కుదింపు.

  • అనకాపల్లిలో 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్‌ ఏర్పాటుకు కంట్రోల్‌ ఎస్‌ డేటా సెంటర్స్‌ కు 49.93 ఎకరాల కేటాయింపు.

  • విశాఖ జిల్లాలో ఐటీ క్యాంపస్‌ స్థాపనకు ఇన్ఫినిక్స్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌కు 5.08ఎకరాలు.

  • సత్యసాయి జిల్లా రామగిరిలో 730 ఎకరాలు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌కు కేటాయింపు.

Updated Date - Jun 24 , 2026 | 05:02 AM