Share News

దుర్గమ్మ పాదాల చెంత బడ్జెట్‌ ప్రతులు

ABN , Publish Date - Feb 15 , 2026 | 04:27 AM

అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందుగా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు బెజవాడ కనక దుర్గమ్మను శనివారం దర్శించుకున్నారు.

దుర్గమ్మ పాదాల చెంత బడ్జెట్‌ ప్రతులు

ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందుగా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు బెజవాడ కనక దుర్గమ్మను శనివారం దర్శించుకున్నారు. అమ్మవారి పాదాల చెంత బడ్జెట్‌ ప్రతులను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూశ్‌ కుమార్‌, కార్యదర్శి డి.రోనాల్డ్‌ రోస్‌, ఐఏఎస్‌ అధికారులు సూరజ్‌ గనోరే, గౌతమ్‌ అల్లాడ పూజల్లో పాల్గొన్నారు. ఈవో వీకే శీనానాయక్‌ సమక్షంలో వేద పండితుల నుంచి వేద ఆశీర్వచనం పొందారు. అమ్మవారి చిత్రపటం, లడ్డూప్రసాదం, శేషవస్త్రం అందుకున్నారు.

Updated Date - Feb 15 , 2026 | 04:30 AM