అభివృద్ధి, అందరికీ సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - Feb 15 , 2026 | 05:48 AM
‘ప్రతి అడుగులోనూ అభివృద్ధి, అర్హులైన వారందరికీ సంక్షేమం... ఈ లక్ష్యమే కూటమి ప్రభుత్వానికి రథ చక్రాలు. దీనిని ప్రస్ఫుటించేలా బడ్జెట్ రూపుదిద్దుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ‘ప్రతి అడుగులోనూ అభివృద్ధి, అర్హులైన వారందరికీ సంక్షేమం... ఈ లక్ష్యమే కూటమి ప్రభుత్వానికి రథ చక్రాలు. దీనిని ప్రస్ఫుటించేలా బడ్జెట్ రూపుదిద్దుకుంది. అన్ని రంగాలకు ప్రాధాన్యమిస్తూ, రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేసేదిగా ఉంది. గత పాలకుల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ చేస్తున్న కృషి, చూపుతున్న చొరవ బడ్జెట్‌లో కనిపించాయి. జనసేన తరఫున అభినందనలు తెలుపుతున్నాం. మూలధన వ్యయం పెంపుతో రాష్ట్రం పుంజుకుంటుంది. రూ.3,32,205 కోట్ల బడ్జెట్‌లో ఎన్నడూ లేనంతగా మూలధన వ్యయం పెంపు కనిపిస్తోంది’
- నాదెండ్ల మనోహర్, మంత్రి