Share News

నేడు జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానం

ABN , Publish Date - Jun 03 , 2026 | 04:36 AM

జాతీయ పంచాయతీ అవార్డులను కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రదానం చేయనుంది. కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రి రాజీవ్‌ రంజన్‌సింగ్‌...

నేడు జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానం

  • ఏపీకి దక్కనున్న 5 పురస్కారాలు

న్యూఢిల్లీ, అమరావతి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): జాతీయ పంచాయతీ అవార్డులను కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రదానం చేయనుంది. కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రి రాజీవ్‌ రంజన్‌సింగ్‌, సహాయ మంత్రి ఎస్పీ బఘేల్‌ ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ సతాత్‌ వికాస్‌ పురస్కార్‌ గ్రామ పంచాయతీ కేటగిరీ కింద సుపరిపాలనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా నాతవరం మండలం శృంగవరం పంచాయతీ మొదటి ర్యాంకు, మహిళా స్నేహపూర్తి పంచాయతీగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామానికి మొదటి ర్యాంకు, పేదరిక నిర్మూలన-జీవనోపాధుల పెంపు కేటగిరీలో వైఎ్‌సఆర్‌ కడప జిల్లా ఖాజీపేట మండలం చెమ్ముళ్లపల్లి పంచాయతీకి రెండో ర్యాంకు, స్వయంగా మౌలిక వసతులు కల్పించిన పంచాయతీల కేటగిరీల కింద ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం గుండమల పంచాయతీకి మూడో ర్యాంకు దక్కాయి. అదేవిధంగా నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ్‌ పంచాయతీ సతాత్‌ వికాస్‌ పురస్కార్‌ కేటగిరీ కింద మండల స్థాయిలో చిత్తూరు జిల్లా కుప్పం మండలానికి అవార్డు దక్కింది. బుధవారం జరిగే కార్యాక్రమంలో ఈ ఐదింటికీ పురస్కారాలు అందజేస్తారు.

Updated Date - Jun 03 , 2026 | 04:36 AM