Share News

రాష్ట్రానికి 14 లక్షల కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Jun 19 , 2026 | 05:34 AM

‘రాష్ట్రంలో రూ.14 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అవి ఎంవోయూకే పరిమితం కాలేద. నేరుగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి’ అని..

రాష్ట్రానికి 14 లక్షల కోట్ల పెట్టుబడులు

  • వైసీపీ, కాంగ్రస్‌లకు అభివృద్ధి కనిపించకపోతే జనకల్యాణ్‌కి రండి

  • శిబిరం ప్రారంభంలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు మాధవ్‌

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో రూ.14 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అవి ఎంవోయూకే పరిమితం కాలేద. నేరుగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ అన్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్‌లో బీజేపీ ఓబీసీ మోర్చ, మహిళా మోర్చా సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనకల్యాణ్‌ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో మాధవ్‌ మాట్లాడారు. దేశ ప్రధాని మోదీ చలవ, సీఎం చంద్రబాబు ముందు చూపు వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ వేగం మాదిరి రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. జగన్‌, షర్మిల ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని.. డీఎస్సీపై రాద్ధాంతం చేయడాన్ని తప్పు పట్టారు.

Updated Date - Jun 19 , 2026 | 05:35 AM