Share News

అసెంబ్లీలో రెండు బిల్లులకు ఆమోదం

ABN , Publish Date - Mar 06 , 2026 | 04:01 AM

అసెంబ్లీలో ప్రభుత్వం గురువారం రెండు బిల్లులను ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది.

అసెంబ్లీలో రెండు బిల్లులకు ఆమోదం

ఇంటర్నెట్ డెస్క్: అసెంబ్లీలో ప్రభుత్వం గురువారం రెండు బిల్లులను ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. ఏపీ మోటార్‌ వెహికల్స్‌ ట్యాక్సేషన్‌ సవరణ బిల్లు 2026ను రవాణా మంత్రి మండిపల్లి రామప్రసాదర్‌రెడ్డి, జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాల చట్టం, 2008 సవరణ బిల్లును మంత్రి లోకేశ్‌ తరఫున రెవెన్యూ మంత్రి సభలో ప్రవేశపెట్టారు. అలాగే, శాసనమండలిలో రెండు బిల్లులకు ఆమోదం లభించింది. అగ్నిమాపక సేవల సవరణ బిల్లును హోంమంత్రి అనిత, ఏపీ జనవిశ్వాస(నిబంధనల సవరణ) బిల్లును మంత్రి ఫరూక్‌ ప్రవేశపెట్టారు.

Updated Date - Mar 06 , 2026 | 04:05 AM