పర్యాటక పాలసీలో మూడు సంస్థలకు ప్రోత్సాహకాలు
ABN , Publish Date - Jun 30 , 2026 | 04:32 AM
రాష్ట్రంలోని మూడు ప్రముఖ సంస్థలకు పర్యాటక పాలసీ 2024-29 ప్రకారం ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మూడు ప్రముఖ సంస్థలకు పర్యాటక పాలసీ 2024-29 ప్రకారం ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో విజయనగర ఇన్వస్ట్‌మెంట్స్ అండ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ 35 ఏకో కాటేజీల నిర్మాణంతో పాటు బ్రాండ్ త్రిఫల ఆయుర్వేదను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది. సీఆర్‌డీఏ పరిధిలో వరుణ్ హాస్పిటాలటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఫైవ్ స్టార్ హోటల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధమైంది. రూ.210.14 కోట్లతో ఈ ప్రాజెక్టుకు చేపట్టనుంది. వైట్ రిసార్ట్స్ విశాఖపట్నంలో రూ.79 కోట్లతో త్రీస్టార్ హోటల్ నిర్మాణానికి సిద్ధమైంది. ఈ 3 సంస్థలకు పర్యాటక పాలసీ ప్రకారం ప్రోత్సాహకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. 10శాతం క్యాపిటల్ ఇన్వస్ట్‌మెంట్ ను ఐదేళ్లలో ప్రభుత్వం ఇవ్వనుంది. 100 శాతం స్టాంప్‌డ్యూటీని రీయింబర్స్ చేస్తుంది. వీటితో పాటు మరికొన్ని ప్రోత్సాహాకాలను ఆయా సంస్థలకు అందించనుంది.