Share News

మరో ఆరు ‘బయోమెడికల్‌ వేస్ట్‌’ ప్లాంట్స్‌కు టెండర్లు

ABN , Publish Date - Jul 08 , 2026 | 05:03 AM

రాష్ట్రంలో కొత్తగా ఆరు కామన్‌ బయో మెడికల్‌ వేస్ట్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్స్‌ ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మెంబర్‌ సెక్రటరీ ఎస్‌.శర్వానాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

మరో ఆరు ‘బయోమెడికల్‌ వేస్ట్‌’ ప్లాంట్స్‌కు టెండర్లు

అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా ఆరు కామన్‌ బయో మెడికల్‌ వేస్ట్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్స్‌ ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మెంబర్‌ సెక్రటరీ ఎస్‌.శర్వానాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ‘నిబంధనలు గాలికొదిలి అనుమతులిచ్చేద్దాం’ శీర్షికన గత నెల 29వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో కొత్త ప్లాంట్స్‌ కోసం పీసీబీ స్పష్టమైన గ్యాప్‌ అనాలసిస్‌ స్టడీ చేసిందని, దీని ఆధారంగా మరో ఎనిమిది కొత్త ప్లాంట్స్‌ అవసరమని గుర్తించామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 12 ట్రీట్మెంట్‌ ప్లాంట్స్‌ ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం రెండు చోట్ల కొత్త ప్లాంట్స్‌ ఏర్పాటై ఉన్నాయని, అవి కాకుండా మరో ఆరు ప్లాంట్స్‌కు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - Jul 08 , 2026 | 05:05 AM