Share News

ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధికి కొత్త పాలసీ

ABN , Publish Date - Feb 19 , 2026 | 05:56 AM

రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను అప్‌గ్రేడ్‌ చేయడానికి ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు.

ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధికి కొత్త పాలసీ

  • హైవేలపై ట్రామా సెంటర్ల ఏర్పాటు: సత్యకుమార్‌

అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను అప్‌గ్రేడ్‌ చేయడానికి ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. హైవేలపై ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, ముప్పిడి వెంకటేశ్వరరావు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, జ్యోతుల నెహ్రూ, యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ తమ నియోజకవర్గాల్లోని 50 పడకల ఆసుపత్రులను 100 పడకల ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్‌ చేయాలని కోరారు.

Updated Date - Feb 19 , 2026 | 05:57 AM