పశు వ్యాధులకు ఉచితంగా టీకాలు
ABN , Publish Date - Jun 09 , 2026 | 06:04 AM
వానాకాలంలో పశువులకు సోకే వివిధ వ్యాధులకు ఉచిత టీకాల పంపిణీకి పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదార్‌నాయుడు సోమవారం షెడ్యూల్ ప్రకటించారు.
డైరెక్టర్ దామోదర్‌నాయుడు
అమరావతి, జూన్ 8(ఆంధ్రజ్యోతి): వానాకాలంలో పశువులకు సోకే వివిధ వ్యాధులకు ఉచిత టీకాల పంపిణీకి పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదార్‌నాయుడు సోమవారం షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల 10 నుంచి 30 వరకు జబ్బవాపు వ్యాధి నివారణకు, 15 నుంచి వచ్చే నెల 15 వరకు చిటుక వ్యాధి నివారణకు, ఈ నెల 25 నుంచి వచ్చే నెల 25 వరకు గొంతువాపు వ్యాధికి, వచ్చే నెల 1 నుంచి 30 వరకు నీలినాలుక వ్యాధి నివారణకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు తెలిపారు. సాధారణంగా వర్షాకాలంలో ఈ వ్యాధులు తీవ్రరూపం దాల్చితే పశుసంపద అనారోగ్యం బారిన పడకుండా వ్యాధుల నివారణ టీకాలను విధిగా వేయించాలని పశు పోషకులు, కాపరులకు ఆయన కోరారు. పశువులు, జీవాలు అనారోగ్యం బారిన పడితే వెంటనే సమీప పశువైద్యశాలను సంప్రదించాలన్నారు.