అంగన్వాడీలకు వేసవి సెలవులు
ABN , Publish Date - May 03 , 2026 | 04:49 AM
అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం మేలో విడతల వారీగా వేసవి సెలవులను మంజూరు చేసింది. అంగన్వాడీ హెల్పర్‌కు ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు...
అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం మేలో విడతల వారీగా వేసవి సెలవులను మంజూరు చేసింది. అంగన్వాడీ హెల్పర్‌కు ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు, వర్కర్‌కు 16 నుంచి 30 వరకు సెలవులు ప్రకటించారు. అయితే ఈ కాలంలో అంగన్వాడీ కేంద్రాలు మాత్రం యథావిధిగా పనిచేయనున్నాయి. రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి శనివారం ఈ ఆదేశాలు జారీచేశారు. ఈ కాలంలో పోషకాహార పథకానికి అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.