Share News

ఏపీలో కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌ పార్కు

ABN , Publish Date - Apr 29 , 2026 | 05:22 AM

ఏపీతో పాటు ఒడిశా, గుజరాత్‌, మహారాష్ట్రల్లో కీలక ఖనిజాల వాల్యూ ప్రాసెసింగ్‌ పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోం ది. దేశవ్యాప్తంగా మొత్తం 4 పార్కుల ఏర్పాటుకు..

ఏపీలో కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌ పార్కు

  • ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్‌ల్లోనూ ఏర్పాటు: కేంద్రం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 28: ఏపీతో పాటు ఒడిశా, గుజరాత్‌, మహారాష్ట్రల్లో కీలక ఖనిజాల వాల్యూ ప్రాసెసింగ్‌ పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోం ది. దేశవ్యాప్తంగా మొత్తం 4 పార్కుల ఏర్పాటుకు ‘జాతీయ కీలక ఖనిజాల మిషన్‌’ కింద రూ.500 కోట్లు కేటాయించినట్లు ఓ సీనియర్‌ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఏప్రిల్‌ 22న ఈ రాష్ట్రాల అధికారులతో జరిగిన సమావేశంలో పార్కుల ఏర్పాటుకు సంబంధించిన ప్రదేశాలను ఖరారు చేసినట్లు గనుల శాఖ కార్యదర్శి పీయూష్‌ గోయల్‌ మంగళవారం వెల్లడించారు. కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌ వాల్యూ చైన్‌ పరిశ్రమల అభివృద్ధికి ఈ పార్కులు దోహదపడతాయని పేర్కొన్నారు. పోర్టుల సదుపాయం ఉన్నందున పార్కుల ఏర్పాటుకు ఈ 4 రాష్ట్రాలను ఎంపిక చేసినట్లు గోయల్‌ వివరించారు.

Updated Date - Apr 29 , 2026 | 05:24 AM