ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు రూ.11 కోట్ల బడ్జెట్
ABN , Publish Date - Apr 25 , 2026 | 04:54 AM
ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌సీఎల్)కు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ రూ.11 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గుంటూరు, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌సీఎల్)కు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ రూ.11 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2026- 27 ఆర్థిక సంవత్సరానికిగానూ కేటాయించిన ఈ నిధులను నాలుగు త్రైమాసికాల్లో అందజేస్తారు. తొలి త్రైమాసికంలో రూ. 3.85 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ. 2.20 కోట్లు, మూడో త్రైమాసికంలో రూ. 2.20 కోట్లు, నాలుగో త్రైమాసికంలో రూ. 2.75 కోట్లు అందించనున్నారు.