Share News

రైతే రాష్ర్టానికి దన్ను

ABN , Publish Date - Feb 28 , 2026 | 05:48 AM

రైతు బలపడితేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలపడుతుందని ప్రభు త్వం గమనించి, ఈ దిశగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యమిస్తోందని పలువురు సభ్యులు అన్నారు.

రైతే రాష్ర్టానికి దన్ను

  • వ్యవసాయ బడ్జెట్‌ల ఆమోదానికి ప్రతిపాదించిన మంత్రులు నిమ్మల, పార్థసారథి

అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): రైతు బలపడితేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలపడుతుందని ప్రభు త్వం గమనించి, ఈ దిశగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యమిస్తోందని పలువురు సభ్యులు అన్నారు. శుక్రవారం అసెంబ్లీల్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తరఫున జలవనరులశాఖ మంత్రి రామానాయుడు వ్యవసాయ, అనుబంధ శాఖల బడ్జెట్‌ ఆమోదానికి ప్రతిపాదించారు. వ్యవసా య శాఖకు రూ.11,535 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ.1853 కోట్లు, మత్స్యశాఖకు రూ.209 కోట్ల బడ్జెట్‌ ఆమోదానికి ప్రతిపాదించారు. అలానే హౌసింగ్‌, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హౌసింగ్‌కు రూ.6357 కోట్లు, సమాచార శాఖకు రూ.329 కోట్ల బడ్జెట్‌ ఆమోదానికి మంత్రి ప్రతిపాదించారు. అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం వ్యవసాయ అనుబంధంగా రూ.11,535 కోట్లకు పైగా కేటాయించిందన్నా రు. ప్రభుత్వం మైక్రో లెవెల్‌ ప్లానింగ్‌ చేస్తోందని, సీఎం చంద్రబాబు ప్రతి వారం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్ష చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో ఐదేళ్లూ వ్యవసాయాన్ని క్లోజ్‌ చేశారని, నేడు ప్రకృతి వ్యవసాయానికి మనం పెద్ద పీట వేస్తున్నామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తెలిపారు. రాయలసీమలో తక్కు వ నీళ్లతో పంట పండించుకునేందుకు మైక్రో ఇరిగేషన్‌ అవసరమన్నారు. అయితే, 2021-22 పులివెందుల నుంచి రైతులు వచ్చి హార్టికల్చర్‌కు సహకరించాలని అప్పటి మంత్రి కన్నబాబుకు చెబితే, ఆయన నేరుగా జగన్‌కు వద్దకు వెళ్లి రైతుల కోరికను బయటపెట్టారని, దీనిపై.. జగన్‌ స్పందిస్తూ.. అవన్నీ నీకు అవసరమా? అని అన్నారని తెలిపారు.

Updated Date - Feb 28 , 2026 | 05:48 AM