Cultural Competition: ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీ ఫైనల్స్ నేడే
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:44 AM
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు (పవర్డ్ బై సన్‌ఫీ్‌స్ట మామ్స్ మ్యాజిక్ బిస్కెట్లు...
విజయవాడ, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు (పవర్డ్ బై సన్‌ఫీ్‌స్ట మామ్స్ మ్యాజిక్ బిస్కెట్లు... టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా. ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ వారి భారత్‌వాసీ అగర్‌బత్తి) తుది అంకానికి చేరుకున్నాయి. తుది విజేతలు ఎవరో తేల్చే ఫైనల్స్ శనివారం విజయవాడలో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగాను, తమిళనాడు, కర్ణాటకల్లోను సుమారు 40 కేంద్రాల్లో ప్రాథమిక స్థాయి ముగ్గుల పోటీలు ఈ నెల 3, 4, 5, 6 తేదీల్లో జరిగాయి. దాదాపు ఆరు వేల మంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతి కేంద్రంలో విజేతల నుంచి 30 మంది ఫైనల్స్‌కు ఎంపికయ్యారు. వీరంతా విజయవాడలో జరిగే ఫైనల్స్‌లో పోటీ పడనున్నారు. ఈ పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతి రూ.30,000, నాలుగు ద్వితీయ బహుమతులు రూ.10,000 చొప్పున అందజేస్తారు. మరో 25 కన్సొలేషన్ బహుమతులు ఉంటాయి. పోటీల్లో పాల్గొనే అందరికీ స్పాన్సర్ల నుంచి గిఫ్ట్ హ్యాంపర్లు కూడా లభిస్తాయి. కొందరు రాజకీయ, అధికార ప్రముఖులు ఈ ఫైనల్స్‌కు హాజరై విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు.