రైతులకు డబ్బులు పడితే జగన్ ఓర్వలేకపోతున్నారు: అప్పసాని రాజేశ్
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:33 AM
‘రైతులకు నేరుగా లబ్ధి చేకూరుస్తూ అన్నదాత సుఖీభవను విజయవంతంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారు.
అమరావతి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): ‘రైతులకు నేరుగా లబ్ధి చేకూరుస్తూ అన్నదాత సుఖీభవను విజయవంతంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారు. తన విషపుత్రిక ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారు. రైతుల ఖాతాల్లో రూ.3125 కోట్లు పడితే చూసి ఓర్వలేక జగన్ పత్రిక విషం చిమ్ముతోంది’ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేశ్ మండిపడ్డారు.