Share News

సౌదీలో ఆంధ్ర ఇంజనీర్‌ అరెస్టు

ABN , Publish Date - Mar 10 , 2026 | 03:57 AM

యుద్ధ సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పంపించారన్న కారణంతో శ్రీ అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక ప్రవాసీయుడిని సౌదీ అరేబియా పోలీసులు అరెస్టు చేశారు.

సౌదీలో ఆంధ్ర ఇంజనీర్‌ అరెస్టు

  • అనధికార యుద్ధ సమాచారాన్ని షేర్‌ చేయడమే నేరం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

యుద్ధ సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పంపించారన్న కారణంతో శ్రీ అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక ప్రవాసీయుడిని సౌదీ అరేబియా పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లెలోని శ్రీరాముల వీధికి చెందిన 23 ఏళ్ల యువకుడు సౌదీలోని రియాద్‌లో ఎయిర్‌ కండిషనింగ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సామాజిక మాధ్యమాల్లో యుద్ధ వార్తలను షేర్‌ చేశాడన్న కారణంతో అతనిని సౌదీ పోలీసులు అరెస్టు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఖతర్‌లో విడియోలు తీసినందుకు, అనధికార యుద్ధ సమాచారాన్ని ఫార్వార్డ్‌ చేసినందుకు 313 మందిను అరెస్టు చేసినట్లు ప్రభు త్వం సోమవారం ప్రకటించింది.

Updated Date - Mar 10 , 2026 | 03:57 AM