Share News

పల్నాడు జిల్లాలో అన్నదేవుని శాసనం లభ్యం

ABN , Publish Date - Jan 30 , 2026 | 04:41 AM

పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం రవ్వారం గ్రామంలో గురునాథేశ్వరుని చిన్నకొండపై నాగవంశీయుడైన అన్నదేవుని శాసనాన్ని పురావస్తు శాఖ గుర్తించింది.

పల్నాడు జిల్లాలో అన్నదేవుని శాసనం లభ్యం

నరసరావుపేట, జనవరి 29(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం రవ్వారం గ్రామంలో గురునాఽథేశ్వరుని చిన్నకొండపై నాగవంశీయుడైన అన్నదేవుని శాసనాన్ని పురావస్తు శాఖ గుర్తించింది. శాసనం తెలుగు లిపిలో ఉన్నట్లు భారత పురావస్తు సర్వే శాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస ప్రసాద్‌ గురువారం తెలిపారు. ప్రజాపతి నామ సంవత్సరం అశ్వయజ శుద్ధ తదియ సోమవారం క్రీశ 1391 అక్టోబరు 1న ఈ శాసనాన్ని రూపొందించారన్నారు. దర్శి పాలకుడైన అన్నదేవుని సుదీర్ఘ ప్రశంసను ఈ శాసనం తెలియజేస్తున్నదని చెప్పారు.

Updated Date - Jan 30 , 2026 | 04:41 AM