అనంతబాబు భార్యకు కోర్టులో చుక్కెదురు
ABN , Publish Date - Apr 16 , 2026 | 06:03 AM
వైసీపీ నాయకుడు అనంతబాబు భార్యకు కోర్టులో చుక్కెదురైంది. అనంతబాబు తన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో...
డిశ్చార్జి పిటిషన్ కొట్టివేత.. కేసు విచారణ రేపటికి వాయిదా
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకుడు అనంతబాబు భార్యకు కోర్టులో చుక్కెదురైంది. అనంతబాబు తన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో ఆయన భార్య లక్ష్మీదుర్గను ఏ2గా సిట్ చేర్చి అనుబంధ చార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేసు నుంచి తనను తప్పించాలని ఆమె కోర్టులో డిశ్చార్జి పిటిషన్ వేశారు. దీనిపై ఈ సోమవారం వాదోపవాదనలు జరగ్గా.. బుధవారం ఆ పిటిషన్‌ని కొట్టివేస్తూ ఉమ్మడి తూర్పు గోదావరిజిల్లా న్యాయాధికారి సునీత గంధం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాసిక్యూషన్ సమర్పించిన ప్రాథమిక సాక్ష్యాధారాలు, సాంకేతిక సాక్ష్యాలు, కాల్ డేటా రికార్డులు తదితరాలను కోర్టు పరిగణనలోకి తీసుకొని డిశ్చార్జి పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఆ రోజున నేరారోపణలు నమోదు(చార్జెస్ ఫ్రేమ్) చేసే అవకాశం ఉంది. ప్రాసిక్యూషన్ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు, బాధితుల తరఫున ముప్పాళ్ల విశాల్ వాదనలు వినిపించారు.