Share News

అనంతబాబు బెయిల్‌, డైట్‌పై 7న నిర్ణయం!

ABN , Publish Date - Jul 03 , 2026 | 05:53 AM

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌ పిటిషన్‌, హై ప్రొటీన్‌ డైట్‌ ఇవ్వడంపై నిర్ణయాన్ని కోర్టు ఈ నెల 7కు వాయిదా వేసింది. డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో..

అనంతబాబు బెయిల్‌, డైట్‌పై 7న నిర్ణయం!

  • విచారణ వాయిదా వేసిన రాజమండ్రి కోర్టు

రాజమహేంద్రవరం, జూలై 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌ పిటిషన్‌, హై ప్రొటీన్‌ డైట్‌ ఇవ్వడంపై నిర్ణయాన్ని కోర్టు ఈ నెల 7కు వాయిదా వేసింది. డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు అదే కేసులోని సాక్షులను బెదిరించడంతో మరో కేసు నమోదైన విషయం తెలిసిందే. హత్య కేసులో బెయిల్‌పై ఉన్న అనంతబాబు సాక్షులను బెదిరించిన కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండు ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో ఆయన బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే తనకు ఇంటి భోజనం ఇవ్వాలని మరో పిటిషన్‌ వేశారు. ఈ రెండు అంశాలపై గురువారం విచారణ ఉండగా న్యాయమూర్తి సెలవులో ఉండడంతో వాయిదా వేశారు.

Updated Date - Jul 03 , 2026 | 05:54 AM