నా తల్లిదండ్రులకు రక్షణ కల్పించండి
ABN , Publish Date - May 26 , 2026 | 05:08 AM
తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని.. తగిన రక్షణ కల్పించాలని గేయ రచయిత అనంత శ్రీరామ్ అధికారులను ఆశ్రయించారు.
హరిరామజోగయ్య కొడుకుపై అనంత శ్రీరామ్ ఫిర్యాదు
భీమవరం టౌన్/పాలకొల్లు టౌన్, మే 25(ఆంధ్రజ్యోతి): తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని.. తగిన రక్షణ కల్పించాలని గేయ రచయిత అనంత శ్రీరామ్ అధికారులను ఆశ్రయించారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్లలో తమ ఐదు సెంట్ల ఉమ్మడి స్థలాన్ని ఆక్రమించారంటూ, సోమవారం తన తండ్రి చేగొండి వీర వెంకట సత్యనారాయణమూర్తితో కలిసి భీమవరం కలెక్టర్, ఎస్పీలకు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం స్థల వివాదం కోర్టులో ఉండగా, చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ ఈ స్థలం విషయమై తమను మానసిక హింసకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే.. ‘ఆ ఐదు సెంట్ల వివాదాస్పద భూమిపై అనంత శ్రీరామ్‌కు ఏ హక్కూ లేదు’ అని సూర్యప్రకాశ్ ఆరోపించారు.