Share News

నేనెక్కడకూ పారిపోలేదు

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:55 AM

తానేమీ పారిపోలేదని.. రాష్ట్రంలోనే ఉన్నానని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అన్నారు.

నేనెక్కడకూ పారిపోలేదు

  • బొత్సతో ఎమ్మెల్సీ అనంతబాబు

అమరావతి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): తానేమీ పారిపోలేదని.. రాష్ట్రంలోనే ఉన్నానని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అన్నారు. సోమవారం శాసనమండలి ప్రాంగణంలోని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చాంబరుకు ఆయన వచ్చారు. అనంతబాబును చూసిన వెంటనే.. ‘ఏమిటీ.. పరారయ్యావని మీడియాలో, పత్రికల్లో రాశారు’ అని బొత్స ప్రశ్నించారు. తానెక్కడకూ పారిపోలేదని.. ఇక్కడే ఉన్నానని ఆయన బదులిచ్చారు.

Updated Date - Feb 24 , 2026 | 04:55 AM