రోడ్డుపైనే వాహనం బుగ్గి..!
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:20 AM
రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఈ ఎండల ధాటికి ఓ వాహనం రోడ్డుపైనే బుగ్గి అయింది. అనంతపురంలోని కొవ్వూరునగర్‌లో బహిరంగ ప్రదేశంలో...
అనంతపురం క్రైం, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఈ ఎండల ధాటికి ఓ వాహనం రోడ్డుపైనే బుగ్గి అయింది. అనంతపురంలోని కొవ్వూరునగర్‌లో బహిరంగ ప్రదేశంలో కొన్ని రోజులుగా ఓ వాహనం నిలిపి ఉంచారు. సోమవారం నిప్పులు కక్కే ఎండలకు ఉన్నట్టుండి ఆ వ్యాన్‌లో మంటలు వ్యాపించి తగలబడిపోయింది. పొగ భారీగా రావడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి వాహనం కాలిపోతున్న విషయాన్ని గుర్తించారు. వెం టనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు.