Share News

టీటీడీకి అనంత్‌ అంబానీ భారీ విరాళం

ABN , Publish Date - Jun 29 , 2026 | 04:32 AM

రిలయన్స్‌ సంస్థ అధినేత ముఖేష్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ టీటీడీకి భారీ విరాళం ప్రకటించారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి చొరవతో..

టీటీడీకి అనంత్‌ అంబానీ భారీ విరాళం

  • రూ.28 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్‌ బస్సులు ఇస్తాం

  • జీతాలిచ్చి 50 మంది డ్రైవర్లనూ పెడతాం.. ఓ చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు

  • వంతారా తరహాలో తిరుమల గోశాల ఆధునికీకరణ: అనంత్‌

తిరుమల, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): రిలయన్స్‌ సంస్థ అధినేత ముఖేష్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ టీటీడీకి భారీ విరాళం ప్రకటించారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి చొరవతో రూ.28 కోట్లు విలువైన 25 ఎలక్ర్టిక్‌ బస్సులు విరాళంగా అందజేసేందుకు అంగీకారం తెలిపారు. ఆ బస్సుల కోసం 50 మంది డ్రైవర్ల జీతభత్యాలు, చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గుజరాత్‌లోని వంతారా తరహాలో తిరుమలలోని గోశాల ఆధునికీకరణకు కూడా సహకారం అందిస్తామని అనంత్‌ అంబానీ వెల్లడించారు. కాగా.. శనివారం అర్ధరాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అనంతరం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపానికి చేరుకున్న అనంత్‌ అంబానీకి వేదపండితులు ఆశీర్వచనం, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

Updated Date - Jun 29 , 2026 | 04:33 AM