గత ప్రభుత్వంలో దేవదాయశాఖ పరిస్థితి దారుణం: ఆనం
ABN , Publish Date - Feb 26 , 2026 | 04:31 AM
గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ పరిస్థితి అత్యంత దారుణంగా తయరైందని ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ పరిస్థితి అత్యంత దారుణంగా తయరైందని ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. రామతీర్థంలో రాముడి తలను వేరు చేయడం, అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టడం, విజయవాడలో కనకదుర్గమ్మ రథంపై వెండి సింహాలను మాయం చేయడం, బిట్రగుంటలో వెంకటేశ్వరస్వామి రథాన్ని తగలబెట్టడం, పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేక హిందూ దేవాలయాలపై దాడులకు తెగబడటాన్ని చూసిన సామాన్య భక్తులు ఆలయాలకు వెళ్లడమే తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీతో సహా దేవదాయశాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. టీటీడీ నుంచి రూ.750 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని మంత్రి కోరారు.