ప్రజల దృష్టి మరల్చే కుట్రలు: ఆనం
ABN , Publish Date - Feb 02 , 2026 | 04:53 AM
తిరుమలలో వైసీపీ పాలకులు చేసిన పాపాలపై ప్రజల్లో చర్చ జరగకుండా ఆ పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారు అని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ధ్వజమెత్తారు.
నెల్లూరు, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ‘తిరుమలలో వైసీపీ పాలకులు చేసిన పాపాలపై ప్రజల్లో చర్చ జరగకుండా ఆ పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారు’ అని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ మంత్రి ఆనం, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, కాకర్ల సురేశ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆదివారం నెల్లూరులోని రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి ఆనం విలేకరులతో మాట్లాడారు. తిరుమల లడ్డూల్లో కలిపింది అసలు నెయ్యే కాదని సిట్ తేల్చినా, వైసీపీ నేతలు ఇంకా అబద్ధాలతో జనాన్ని ఏమార్చాలని చూస్తున్నారని ఆనం అన్నారు.