Share News

మత్స్యకారుల పొట్ట కొట్టిన పెత్తందారు జగన్‌

ABN , Publish Date - Apr 17 , 2026 | 04:01 AM

మత్స్యకారుల కడుపు కొట్టిన పెత్తందారు జగన్‌రెడ్డి అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

మత్స్యకారుల పొట్ట కొట్టిన పెత్తందారు జగన్‌

  • వారిపై తూటాలు పేల్చి ప్రాణాలు తీశారు: మంత్రి ఆనం

అమరావతి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల కడుపు కొట్టిన పెత్తందారు జగన్‌రెడ్డి అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘గడచిన ఐదేళ్ల కాలంలో జువ్వలదిన్నె మత్స్యకారుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన జగన్‌... ఈ రోజు ఏ మొహం పెట్టుకుని అక్కడకు వెళ్లారు? కనీస సౌకర్యాలు లేని, అసంపూర్తిగా ఉన్న జువ్వలదిన్నె హార్బర్‌ను ఎన్నికల కోసం హడావిడిగా ప్రారంభించిన జగన్‌ మత్స్యకారులను వంచించారు. 15 రోజులుగా పర్యటనను వాయిదా వేస్తూ వచ్చిన జగన్మోహన్‌రడ్డి... స్థానిక వైసీపీ నాయకుల బలవంతంపై జువ్వలదిన్నె పర్యటనకు రావాల్సి వచ్చింది. అక్కడ హార్బర్‌లో కొంత భూమిని డిఫెన్స్‌ టెక్నాలజీ సంస్థకు ఇచ్చాం. దాని ద్వారా అభివృద్ధి చేసి, స్థానిక మత్స్యకార కుటుంబాల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. జగన్‌ దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్‌ పాలనలో మత్స్యకారులపై తూటాలు పేల్చి వారి ప్రాణాలు తీశారు. ఇది వాస్తవం కాదా? జగన్‌, బెంగళూరు ప్యాలె్‌సలో ఉండి రాజకీయాలు చేయడం మానేసి, ప్రజల్లోకి రావాలి. లేకుంటే పబ్‌జీ గేమ్‌లు ఆడుకునే నాయకుడిగా మిగిలిపోతారు’ అని మంత్రి ఆనం విమర్శించారు.

Updated Date - Apr 17 , 2026 | 04:02 AM