Share News

అద్భుత ప్రజా రాజధాని కట్టి తీరుతాం: అనగాని సత్యప్రసాద్‌

ABN , Publish Date - Apr 02 , 2026 | 04:50 AM

అమరావతిలో అద్భుత ప్రజారాజధాని నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బుధవారం టీడీపీ జిల్లా కార్యాలయాన్ని...

అద్భుత ప్రజా రాజధాని కట్టి తీరుతాం: అనగాని సత్యప్రసాద్‌

పుట్టపర్తి, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): అమరావతిలో అద్భుత ప్రజారాజధాని నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బుధవారం టీడీపీ జిల్లా కార్యాలయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్యేలు పల్లె సింధూర, కందికుంట ప్రసాద్‌, ఎంఎస్‌ రాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందుతుంటే వైసీపీ వాకౌట్‌ చేయడం వారి తీరుకు నిదర్శనమన్నారు. అమరావతిలో అద్భుత రాజధాని కట్టితీరుతామని చెప్పారు. రాష్ట్రంలో ఫ్రీహోల్డ్‌పై అధ్యయనం పూర్తి చేశామని, మంత్రివర్గ ఉపసంఘం సమావేశాలను నిర్వహించి, రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల పైచిలుకు ఎకరాలలో అక్రమాలు జరిగినట్లు నిగ్గుతేల్చామని తెలిపారు. ఈ నెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే రెవెన్యూ సమావేశంలో ఫ్రీహోల్డ్‌ చేయగల భూములపై స్పష్టత ఇస్తామని చెప్పారు.

Updated Date - Apr 02 , 2026 | 04:50 AM