వైసీపీ సైకోతత్వాన్ని సహించేది లేదు: అనగాని
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:50 AM
బలులు, రక్తాభిషేకాలు, రప్పారప్పాలు వైసీపీ తత్వమని, ఇలాంటి సైకోతత్వాన్ని సహించేది లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు.
అమరావతి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): బలులు, రక్తాభిషేకాలు, రప్పారప్పాలు వైసీపీ తత్వమని, ఇలాంటి సైకోతత్వాన్ని సహించేది లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగను అందరూ ప్రశాంతంగా జరుపుకొంటుంటే, ఆ ప్రశాంతతను భగ్నం చేయడానికి వైసీపీ నాయకులు సిద్ధమయ్యారని విమర్శించారు. ప్రజలు గాలిపటాలు ఎగరేసుకుంటుంటే, వైసీపీ వారు బీసీ నాయకుల తలలు ఎగరేసే కార్యక్రమంలో ఉన్నారని మండిపడ్డారు. తుని నియోజకవర్గంలో లాలం బంగారయ్యని ఘోరంగా హత్య చేశారని, పల్నాడులో రెండు వర్గాల నడుమ గొడవను శవ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.