సచివాలయ వ్యవస్థ.. గొడ్డలి పార్టీ అనాలోచిత నిర్ణయం
ABN , Publish Date - Sep 29 , 2026 | 06:09 AM
గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ పేరుతో గత ప్రభుత్వం చేసిన పాపాలను, పరిపాలనా లోపాలను కూటమి ప్రభుత్వం ఒక్కటొక్కటిగా సరిదిద్దుతోందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గొ
సర్వీస్ రూల్స్, ప్రమోషన్ చానల్ లేకుండా తెచ్చారు
సచివాలయ సిబ్బందికి పూర్తి న్యాయం చేస్తాం: అచ్చెన్న
శ్రీకాకుళం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ పేరుతో గత ప్రభుత్వం చేసిన పాపాలను, పరిపాలనా లోపాలను కూటమి ప్రభుత్వం ఒక్కటొక్కటిగా సరిదిద్దుతోందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడి అనాలోచిత నిర్ణయంతో సచివాలయ వ్యవస్థ ఏర్పడిందన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో రైతులకు ‘రాజముద్ర’తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సర్వీస్ రూల్స్, ప్రమోషన్ చానల్‌పై కనీస స్పష్టత లేకుండానే కేవలం రూ.15 వేల గౌరవ వేతనంతో ఈ వ్యవస్థను తెచ్చి యువత జీవితాలతో జగన్ చెలగాటమాడారని మండిపడ్డారు. ప్రస్తుతం ఉనికి కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగులు, సామాజిక వర్గాలు, ప్రాంతాల మధ్య వైసీపీ కుట్రపూరితంగా అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత ప్రభుత్వం నిజంగా ఆదర్శవంతమైన వ్యవస్థను తెచ్చి ఉంటే.. ఉద్యోగులకు స్పష్టమైన సర్వీస్ రూల్స్, ప్రమోషన్ చానల్, భవిష్యత్ అవకాశాలు ఎందుకు కల్పించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలతో మాట్లాడాలని, దీనిపై ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు. పదోన్నతులు కల్పించడం, అవసరమైన చోట సిబ్బంది సర్దుబాటు, శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలను గాడిలో పెడుతూ.. శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తోందన్నారు.