ఓటర్లకు గుర్తింపు కార్డు తప్పనిసరి
ABN , Publish Date - Nov 21 , 2026 | 11:41 PM
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లే ఓటర్లు స్లిప్‌తోపాటు ప్రభుత్వం సూచించిన ఏదైనా గుర్తింపుకార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని ఆర్డీవో ఓబులేసు కోరారు.
పోలింగ్ కేంద్రాన్ని తెలిపేందుకు మాత్రమే ఓటరు స్లిప్
పత్తికొండ ఆర్డీవో ఓబులేసు
పత్తికొండ, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లే ఓటర్లు స్లిప్‌తోపాటు ప్రభుత్వం సూచించిన ఏదైనా గుర్తింపుకార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని ఆర్డీవో ఓబులేసు కోరారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రతి పోలింగ్‌బూత పరిధిలో ప్రభుత్వ సిబ్బంది ఓటరు స్లిప్‌లు ఓటర్లకు అందిస్తారన్నారు. అయితే అదికేవలం ఓటరుకు పోలింగ్‌బూతను తెలియచేసేందుకు మాత్రమేనన్నారు. ఓటర్‌కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స లేక ఏదైనా ప్రభుత్వం అందించిన గుర్తింపుకార్డును చూపితేనే పోలింగ్‌అధికారి ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారన్నారు. పత్తికొండ డివిజన పరిధిలో ఆలూరు నియోజకవర్గంలోని ఆరుమండలాల్లో మొదటివిడతగా ఈనెల 26న ఎన్నికలు జరుగుతాయని , 25వ తేదీనాటికీ ఓటర్లకు స్లిప్‌లు అందజేయాలన్నారు. పత్తికొండ నియోజకవర్గ పరిధిలో నామినేషన్లు స్వీకరిస్తున్నారన్నారు. సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం
మద్దికెర: మండలంలోని నామినేషన్ల కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని పత్తికొండ ఆర్డీవో చిన్న ఓబులేసు తెలిపారు. శనివారం మద్దికెర గ్రామంలోని 4వ సచివాలయంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఆర్వోలు సరోజమ్మను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు ముగిసేవరకు ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో కేవీ నాగేంద్ర ప్రసాద్, తదితరులున్నారు .