Andhra Pradesh government: ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు నిబంధనల్లో సవరణలు
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:53 AM
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాలనుకునే ప్రైవేటు యూనివర్సిటీలకు సంబంధించిన నిబంధనల్లో ప్రభుత్వం సవరణలు చేసింది.
అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాలనుకునే ప్రైవేటు యూనివర్సిటీలకు సంబంధించిన నిబంధనల్లో ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ మేరకు శనివారం ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు వర్సిటీల కోసం చేసుకునే దరఖాస్తులు ఎలా ఉండాలనే దానిపై తాజా ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. వర్సిటీల యాజమాన్యాలు.. డీపీఆర్, దరఖాస్తు, సంబంధిత డాక్యుమెంట్లు వంటి వివరాలను ఉన్నత విద్యాశాఖకు సమర్పించాలని తెలిపింది. ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్ కోటా కింద ఇచ్చే 35 శాతం సీట్లను ఉమ్మడి ప్రవేశ పరీక్షల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. మరోవైపు ఆ సీట్లకు ఏపీ విద్యార్థులు మాత్రమే అర్హులని స్పష్టం చేసింది. కన్వీనర్ కోటా మినహా మిగిలిన 65 శాతం సీట్లను యూనివర్సిటీలు వారి సొంత ప్రవేశ పరీక్షల ద్వారా భర్తీ చేసుకునే వెసులుబాటు కల్పించింది. వీటితో పాటు మరికొన్ని వర్సిటీలకు మినహాయింపులు ఇచ్చింది.