ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలి: అంబికా కృష్ణ
ABN , Publish Date - Jul 19 , 2026 | 04:04 AM
ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమపై ఆధారపడిన ఐదు వేల మందిని, పరిశ్రమను బతికించేందుకు అగ్ర హీరోలు తమ సినిమా షూటింగ్‌లో కనీసం ఒక్క షెడ్యూల్ అయినా..
ఏలూరు, జూలై 18(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమపై ఆధారపడిన ఐదు వేల మందిని, పరిశ్రమను బతికించేందుకు అగ్ర హీరోలు తమ సినిమా షూటింగ్‌లో కనీసం ఒక్క షెడ్యూల్ అయినా రాష్ట్రంలో చిత్రీకరించడానికి సహకరించాలని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్, సినీ నిర్మాత అంబికా కృష్ణ కోరారు. ఏలూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ర్టాల విభజనతో ఏపీలో సినీ పరిశ్రమ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆయన తెలిపారు. నంది అవార్డులను త్వరితగతిన పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.