Share News

Ambedkar Statues: ఎస్సీ హాస్టళ్లు, గురుకులాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలు

ABN , Publish Date - Jan 06 , 2026 | 06:17 AM

రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అంబేడ్కర్‌ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రతిపాదనపై సాంఘిక సంక్షేమ బోర్డు చర్చించింది.

Ambedkar Statues: ఎస్సీ హాస్టళ్లు, గురుకులాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలు

రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అంబేడ్కర్‌ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రతిపాదనపై సాంఘిక సంక్షేమ బోర్డు చర్చించింది. తాడేపల్లిలోని ఏపీ గురుకుల సొసైటీ కార్యాలయంలో మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అఽధ్యక్షతన సాంఘిక సంక్షేమ బోర్డు సమావేశమైంది. రాష్ట్రంలో 15 డిగ్రీ కళాశాలల ఏర్పాటు, అన్ని గురుకులాల్లో విద్యార్థులకు బేసిక్‌ కంప్యూటర్‌ కోర్సు, సోలార్‌రూ్‌పటాప్‌ ఏర్పాటు, ఐఐటీ, నీట్‌ ఎక్సలెన్సీ సెంటర్లలో విద్యార్థులకు వాషింగ్‌మెషిన్‌ సౌకర్యం తదితర అంశాలు చర్చకు వచ్చాయి.

వంట సిబ్బంది నియామకం

రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో 133 మంది సిబ్బందిని థర్డ్‌పార్టీ సంస్థ ద్వారా నియమిస్తూ సాంఘిక సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. అదనంగా 28 మంది వంటవాళ్లను, 105 మంది కామాటిలను నియమించింది.

Updated Date - Jan 06 , 2026 | 06:18 AM